భవిష్యత్తు యువతదే అంటూ ఉంటారు కానీ నేటి యువతలో
మానసిక ఒత్తిడి, కుంగుబాటు, సాధించాలనుకున్నది సాధించలేకపోతే నైరాశ్యంతో తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. మొన్న సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నేడు యువ క్రికెటర్ కరణ్ తివారీ… ముంబై మలాద్ లో ఉండే
ఈ యువ క్రికెటర్ తనను ఐపీఎల్ లోకి తీసుకోలేదన్న వేదనతో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో నేటి యువత మానసిక ఒత్తిడి ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు మారాలని ఆశిద్దాం.
