IPL 2023 : క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఆట మాత్రమే కాదు అది ఒక ఎమోషన్. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరూ క్రికెట్ ప్రేమికులే. ఈ క్రమంలో దేశంలో యువ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు పుట్టుకొచ్చిందే ఐపీఎల్. అయితే, ఈసారి ఐపీఎల్ సీజన్ కాస్త కొత్తగా కనిపించనుంది. అందుకు కొన్ని కీలక మార్పులు చేసింది బీసీసీఐ.
5 రన్స్ పెనాల్టీ..
గ్రౌండ్ లో ఉన్న ఫీల్డింగ్ జట్టు బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డర్ గానీ, వికెట్ కీపర్ గానీ కదిలితే.. ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగులు జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా ఆ బంతిని డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. నిర్ణీత టైంలోగా ఓవర్లు పూర్తి చేయకపోయినా, థర్టీయార్డ్ సర్కిల్ బయట ఐదుగురు ప్లేయర్లకు బదులుగా నలుగురినే అనుమతిస్తారు.

ఇంపాక్ట్ ప్లేయర్..
మ్యాచ్ కోసం ప్రతి జట్టూ తుది 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు సబ్ ట్యూట్లను ప్రకటించాలి. ఆ నలుగురిలో నుంచే ఒకరిని ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించొచ్చు. తుది 11 మందిలో విదేశీ ఆటగాళ్లు నలుగురు కంటే తక్కువ ఉంటే తప్పా, ఈ ఇంపాక్ట్ ఆటగాడిగా కచ్చితంగా భారత క్రికెటర్నే ఎంచుకోవాలి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్ స్థానంలో స్పిన్నర్ను ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించొచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్ అవసరం ఉంది. అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్ స్థానంలో బ్యాటర్ను తీసుకోవచ్చు.
వైడ్, నోబాల్ రివ్యూ..
బ్యాట్స్ మెన్ ఔటా? నాటౌటా? అని తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పటి వరకు డిసిషన్ రివ్యూ తీసుకునేవాళ్లు. అయితే, ఈ సీజన్ నుంచి ఆ రూల్ లో మరికొన్నింటిని యాడ్ చేశారు. ఈ ఐపీఎల్ లో వైడ్, నో బాల్ కు కూడా రివ్యూ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. మొత్తానికి ఈ నయా రూల్స్ ఈ సీజన్ మరింత ఆసక్తిగా మారనుంది. ఈ ఏ రోజు నుంచి ప్రారంభం కానున్న మొదటి మ్యాచ్ లో గుజరాత్, చెన్నై జట్లు తలపడనున్నాయి.
