IPL 2023:నేడే మన సన్ రైజర్స్ సమరం షురూ .. ఈరోజు ఉప్పల్ లో రాజస్థాన్ తో ఢీ
హైదరాబాద్ సన్ రైజర్స్ వేట మొదలైంది..తన సత్తా చాటడానికి సై అంటోంది.IPL అంటే కేవలం బ్యాటింగ్..సిక్స్ లు ,ఫోర్స్..ఇలా కేవలం మ్యాచ్ అధ్యంతం బ్యాటింగ్ మోజులో బౌలింగ్ మీద మోజు తగ్గిన సగటు క్రికెట్ అభిమాని కి…బౌలింగ్ మీద ఇష్టాన్ని పెంచిన టీం అంటే అది హైదరాబాద్ టీం మాత్రమే అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు ..
పెద్ద పెద్ద స్టార్స్ లేకున్నా 10 సార్లు IPL సీజన్ లు ఆడి ఒకసారి విజేత గా నిలిచింది.మరోసారి రన్నరప్ గా కూడా నిలిచి, నాలుగు సార్లు ప్లే ఆఫ్ కి వెళ్లిన చరిత్ర హైదరాబాద్ కే సొంతం ….తమదైన రోజున ఎంతటి గట్టి టీం ని అయినా మట్టి కరిపించే సత్తా ఉన్న టీం సన్ రైజర్స్ హైదరాబాద్.
లో స్కోర్ మ్యాచ్ లో అద్భుతమైన విజయాలు అందుకున్న చరిత్ర కూడా సన్రైజర్స్ కే సొంతం
ఈ సారి IPL లో కూడా తనకున్న బౌలింగ్ బలం తో అద్భుతాలు సృష్టించాలి అని.. మరోసారి IPL కప్ సగర్వంగా అందుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. చూడాలి మరి అభిమానుల అంచనాలు ఏ మేరకు అందుకుంటారో.. ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్..