IPL Matches for Free: క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఆట మాత్రమే కాదు అది ఒక ఎమోషన్. వందకోట్ల భారతీయులను ఏకతాటిపైకి తెచ్చే శక్తి క్రికెట్ కి ఉంది. ఇండియా.. ఇండియా.. అనే నినాదాలతో స్టేడియంలో చొక్కాలు చించుకొంటారు. మన దేశంలో క్రికెట్ ఇష్టపడని వారు చాలా అరుదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరు క్రికెట్ ప్రేమికులే.
ఈ క్రమంలో దేశంలో యువ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు పుట్టుకొచ్చిందే ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబడుతున్న క్రీడా లీగ్‌లలో ఒకటి. (National Football League మొదటి స్థానంలో ఉంది). దాదాపు 2 నెలల నుంచి సాయంత్రం అయిందంటే చాలు IPL మ్యాచ్ ల కోసం టీవీలకు అతుక్కుపోయే వారు క్రికెట్ లవర్స్.
అయితే ఏదో ఒక పని మీద బయటకు వెళ్లినవారు లేదా ఉద్యోగం చేసేందుకు వెళ్లినవారు మ్యాచ్ చూడాలి అంటే మాత్రం ఏదైనా ఒక ఓటీటి యాప్ ను సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కొందరు ఐపీఎల్ మ్యాచ్ ను మిస్ అవుతూ ఉంటారు. కానీ 2023 ఐపీఎల్ సీజన్ ని ప్రస్తుతం ఫ్రీగా చూసేందుకు అవకాశం ఉంది.
మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను జియో సినిమా స్ట్రీమింగ్ చేయనుంది. ఈ క్రమంలోనే జియో యూసర్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే మ్యాచ్ చూసేయోచ్చు. ఫ్రీగా చూసే అవకాశం ఉండడంతో అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.