ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత పథకంపై జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కుసంపూడి పలు విమర్శలు చేసారు. నాలుగు సంవత్సరాలకి రూ. 75,000 లు, సంవత్సరానికి రూ.17,500 లు, నెలకి రూ. 1,562.50 పై.లు. అంటే రోజుకి రూ. 52.08 పై.లు ఇచ్చి అక్కాచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడం అంటే నిజంగా సాహసమే. ఈ విషయంలో సిఎం గారికి పాలాభిషేకాలు, పూలాభిషేకాలూ చేయాల్సిందే అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
