మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. దీంతో గత 2, 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతుంది.
అయితే సెన్సేషన్ ఏదైనా.. సిచువేషన్ ఎలాంటిదైనా..దానిని ఓన్ చేసుకుని.. చివరకు దాన్ని వివాదాస్పదంగా మారుస్తాడు మెగా బ్రదర్ నాగబాబు. అది కాస్తా ఇష్యూగా మారాక.. వివరణ ఇచ్చుకుంటాడు. మెగా బ్రదర్ నాగబాబుకు ఇది కామన్‌గా మారింది.
తాజాగా గరికపాటి, మెగాస్టార్ ఇష్యూలో కూడా సేమ్ సీన్. చిన్న విషయాన్ని.. తన ట్వీట్‌తో పెద్దదిగా చేశాడు. చివరకు వివాదాస్పదం మార్చాడు. అటు అన్నయ్య సినిమాల్లో.. ఇటు తమ్ముడు రాజకీయాల్లో.. ఇద్దరూ సక్సెస్ ఫుల్ జర్నీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న మిడిల్ బ్రదర్ నాగబాబు మాత్రం స్మాల్ స్క్రీన్‌పై మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఎప్పుడూ ఏదో వివాదంపై స్పందిస్తూ ఉంటాడు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి మధ్య జరిగిన విషయంలో తాను ఎంటరై ఇష్యూగా మార్చేశాడు. ఎప్పట్లాగే మళ్లీ తానే వివరణ ఇచ్చుకున్నాడు.
మెగా బ్రదర్ ట్వీట్ పెట్టకముందే, మెగా అభిమానులు అవధాని పెద్దగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే నాగబాబు ట్వీట్ తో హైలెట్ అయ్యి మీడియాకు వార్తగా మారాడు.
