రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చిరంజీవి గారితో భేటీ వెనుక ఏదో బలమైన కారణం ఉందని, సోముకు చిరంజీవి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా సోము నియమితులైన దగ్గర నుంచి మీడియాలో ఆయన గురించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుటినుంచీ తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఘోరమైన పరాజయం మూటకట్టుకున్న తర్వాత బీజేపీతో వారు మిత్ర పక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కి అత్యంత ఆప్తుడు అయిన సోముకి బీజేపీ కిరీటం దక్కడంతో ఇరుపార్టీల మధ్య మరింత సయోధ్య కదిరి రాబోయే ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించే విధంగా పార్టీలు కలిపి పని చెయ్యాలని చిరంజీవి గారు సూచించినట్టు తెలిసింది.
దీనిపై మరో సామాజిక కోణాన్ని కూడా ఇతర పార్టీల నాయకులు ఆలోచిస్తున్నారు. వీరిద్దరూ కొంతమంది సానుభూతి పరులతో కలిసి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లని ఏకీకృతం చేస్తూ మిగిలిన వర్గాలని కొంతమేర ఆకర్షించగలిగితే ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం కష్టం కాదని తెలుస్తోంది. ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూద్దాం.