వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం కొన్నాళ్ళకు ఆ నిర్ణయం బెడిసికొట్టి మళ్లీ నిర్ణయం మార్చుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే మద్యం పాలసీని ఇసుక పాలసీని పునః సమీక్షలు చేస్తున్న సర్కారు ప్రతిపక్ష పార్టీలకు తానంతట తానే
అస్ర్తాలు ఇస్తోంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు
దాని మంచి చెడులును పర్యవేక్షణ చెయ్యాల్సిన సలహాదారులు ఏం చేస్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంది. నూతన పాలసీలతో ప్రజలకు మెరుగైన సేవలు అందాలి గానీ మరింత ఇక్కట్లకు గురిచేస్తే పార్టీకి ఏవిధంగా ప్రయోజనం అని పార్టీ నాయకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు పాఠశాలల పునఃప్రారంభం అంశంపై కూడా తల్లిదండ్రుల స్పందన అలాగే వుంది.కరోనా పూర్తిస్థాయిలో కట్టడి చెయ్యకుండానే ఇప్పుడు స్కూళ్ళు తెరిస్తే పిల్లల ఆరోగ్యం మాటేమిటని వారు నిలదీస్తుండటంతో స్కూల్ యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ
ప్రాంతాల్లో టీచర్లుకు కరోనా పరీక్షలు నిర్వహించి క్రమంలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో టీచర్లు, విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విశాఖ జిల్లాలో 52 మందికి ఇందులో 46 మంది టీచర్లు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
విద్యార్థులకు కూడా కరోనా సోకడంతో ఇక రాష్టవ్య్రాప్తంగా మీడియాలో వార్తలు హల్ చల్
చెయ్యడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడక తప్పలేదు.
కరోనాకి వ్యాక్సిన్ వచ్చేదాకా పిల్లల్ని స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేని కారణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మళ్లీ సమీక్షకు వెళ్లక తప్పదు. ప్రభుత్వం మొండిగా వెళితే విమర్శలు తప్పని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ విధానాలు తరచు గా మార్చుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది. అసలు ప్రభుత్వాన్ని ఎలా నడపాలో వైసీపీ నాయకులకు తెలీదని ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.