Jamili Elections : మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. కేంద్రం జమిలిగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా రావల్సి ఉంది.. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుంది. ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వృధా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి విషయమే. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమే.
రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పు రావాలి అని ఆయన వెల్లడించారు. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలి అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచి సందేశం వెళ్తుంది. జమిలి ఎన్నికలు పాత విషయమే. గతంలోనూ లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. జనసేన పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా దాని వెనుక జనహితం కచ్చితంగా ఉంటుంది.

పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిండు మనసుతో దాన్ని పాటిస్తారు. ఆయన పాటించడమే కాదు.. నాయకులు, కార్యకర్తలకు సైతం ఆదరించేలా చూస్తారు ఈ విధము ఈ విధానమే జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళుతుంది ఆయన పార్టీ కార్యకర్తలతో నాయకులతో మమేకమై పనిచేస్తూ పార్టీని ఎప్పుడు ఉన్నతశ్రేణిలోనే నిలబెట్టేలా ఉంటారు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
