Janasena : వైసిపి నాయకులు చాలా దిగుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. జనసేన మీద బురదల్లే క్రమంలో వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ముగ్గురివి పల్లకీ మోస్తున్నట్టు పెద్ద, పెద్ద ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ అంతటా ఏర్పాటు చేసి ఐపీసీ సెక్షన్ 292, 34 మరియు 153(ఎ) ప్రకారం శిక్షార్హమైన నేరపూరితమైన చర్యలకు వైసీపీ నాయకులు పాల్పడ్డారు.
అయితే వారిని విచారించి వారిపై కేసు పెట్టావల్సిన పోలీసులు,అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తు.. వైసీపీ తప్పుడు ఫ్లెక్సీలపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. పోలీసులు అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా. హిందూపురం, విశాఖపట్టణం, ఒంగోలు ప్రాంతాలలో మొత్తం 31 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.
ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము అని జనసేన కార్యకర్తలు తెలిపారు. తప్పు చేసిన వైసీపీ వాళ్లపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు.. తప్పుడు ఫ్లెక్సీల విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చిన జనసేన పార్టీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 427, 341, మరియు 153(ఏ) ఉపయోగించడం రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ దుస్థితిని తెలియజేస్తుంది అని పోలీసులపై మండి పడ్డారు.
ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ పట్ల సానుకూలత పెరగడం చూసి.. వైసీపీ ఈ ఫ్లెక్సీల కుతంత్రానికి పాల్పడింది. ప్లెక్సీలు పెట్టడం ద్వారా జన సైనికులు, వీర మహిళలను రెచ్చగొట్టి.. తద్వారా వారిని తమకు ఇష్టమైన సెక్షన్ లలో బంధించి, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పాలన్నది వారి పన్నాగంగా కనబడుతుంది. పోలీస్ ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని వై.సి.పి. కుట్రలను నిలువరించాలని జనసేన పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసారు.