Janasena Chief Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న జనసేన ఇప్పుడు కర్ణాటకలో బిజెపి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తుందని, అందులో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు అని తెలుస్తుంది.
రాజకీయాల్లో ఇచ్చి,పుచ్చుకోవడం అనేది కామన్. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది బిజెపి తరఫున పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ప్రచారం చేస్తే ఆయన ప్రతిఫలంగా ఏం ఆశిస్తారో అని చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ బిజెపి ప్రభుత్వం ఆయనకు
ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉందని ,కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంత నమ్మకంతో బిజెపి పవన్ కళ్యాణ్ కి ఇంత గౌరవం ఇస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఏం కోరుతాడు అనేది చూడాలి. వచ్చే సంవత్సరం ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.
ఆ సమయంలో బిజెపినీ ,పవన్ కళ్యాణ్ రివర్స్ గిఫ్ట్ కోరే ఛాన్స్ ఉంది. అప్పుడు బిజెపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ వచ్చే సంవత్సరం ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నారని ఆ విషయంలో బిజెపి కాస్త ఎడమొహం ,పెడమొహం గానే ఉందని తెలుస్తుంది. ఒకవేళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విషయం పట్ల బీజేపీలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.