Janasena Chief Pawan Kalyan : అకాలా వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ ఈరోజు రాజమండ్రిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు.
రైతుకు గిట్టుబాటు ధర లేదని తెలిసి, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ,రైతులకు మరింత చేరువుగా ఉండడానికి ,ప్రతిసారి రైతు ఇబ్బంది పడ్డప్పుడల్లా మంగళగిరి కి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటే వారికి ఇబ్బంది కలగకుండా, మేమే రైతులకు అందుబాటులో ఉండాలని నిర్ణయంతో ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని స్థాపించాము అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.

అన్నం పెట్టే రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, రైతుకు బ్యాంకులో రుణాలు వేస్తామని చెప్పి ఆ రుణాలను సకాలంలో చెల్లించకపోగా, కనీసం బ్యాంకులలో కూడా వేయకపోవడం, ప్రభుత్వం యొక్క చేతకానితనానికి నిదర్శనం. వాస్తవానికి రైతు బ్యాంకు ఖాతాలో 1లక్ష 75 వేల రూపాయలు ఉన్నాయని ప్రభుత్వం పైకి చెబుతున్నా కూడా, రైతు అకౌంట్లో ఎటువంటి రుణము జమ కావట్లేదు. అంటే రైతుల పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.
మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. తెలంగాణ విభజనకు మూలం ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లాలో వ్యవసాయం పచ్చగా ఉండి, ధాన్యం, పంట ఎప్పుడు సమృద్ధిగా ఉండి ,రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే నమ్మకంతోనే ,కానీ ఈరోజు పచ్చగా ఉండే జిల్లాల్లో అతివృష్టి, తాండవిస్తున్నాయి. అతివృష్టి కారణంగా ధాన్యం తడిచిపోయి, కళ్ళాలోనే ధాన్యం ముద్ద అయిపోయింది.

ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోగా, ఎటువంటి సాయం రైతన్నలకు అందివ్వలేదు. ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వ వ్యక్తులు కానీ, వ్యవసాయ సంబంధిత అధికారులు కానీ, ఏ ఒక్కరు వచ్చి కూడా రైతును పరామర్శించి వారి సమస్యను తెలుసుకోలేదు. ప్రతి మండల పంచాయతీకి సంబంధించి కనీసం 1500 ఎకరాలు భూమి ఉంటుంది. కానీ రైతన్నలకు దానికి అవసరమయ్యే పనిముట్లను,యంత్రాలను గాని ప్రభుత్వం అందించలేక పోతుంది.
రైతన్నలు కోరుకునేది ఒకటే, మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రుణమాఫీ అవసరం లేదు, కనీసం మాకు పెట్టుబడి కోసము పావుల వడ్డీకి 25వేల రూపాయల రుణమిస్తే చాలు అని.. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అది కూడా చేయలేకపోతుందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రైతు ఏదైనా వినతిపత్రం ఇవ్వాలని అధికారుల దగ్గరకు, కార్యాలయల దగ్గరకు వెళితే వారికి ఎటువంటి న్యాయం జరగట్లేదు. వారు ధర్నాలు చేసి మరీ, వారి సమస్యలను విన్నవించుకోవాల్సి వస్తుంది.

అవసరమైతే సమస్యతో ఉన్న రైతునే జైళ్లలో పెడుతున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రైతుల పట్ల వైసిపి ప్రభుత్వం చూపిస్తున్న ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. రైతులు మేము వెళ్ళగానే తమ గోడును మాకు వెళ్ళబుచుకున్నారు, మాతో సమస్యలు చెప్పిన రైతన్నలకు పోలీసు శాఖ వారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ కార్యకర్తలు గాని, ఎటువంటి హాని కలిగించినా వారిపైన ఏ రకమైన దుశ్చర్యలు చేసిన, జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు.
