Janasena Chief Pawan Kalyan : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోనీ రైతులను బుధవారం రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగి రైతులు చాలా నష్టపోయారు. ఇన్ని నెలలు కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయంలో అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి.
పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ,పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో ,రాదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. చేతికి అందిన పంట నీళ్ల పాలు కావడంతో కష్టాలలో ఉన్న రైతులను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్లనున్నారు. బుధవారం మొదటగా పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకుంటారు.
తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల మీదుగా పర్యటనను సాగిస్తారు. వర్షాలకు రైతులు ఎంతో పంట నష్టాన్ని చవిచూశారు. తమను ఆదుకునే నాయకుడు కోసం ఎదురుచూస్తున్న రైతులను పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి రైతు గోడు విననున్నారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో పాటు, రాష్ట్ర, జిల్లా నాయకులు కూడా పాల్గొననున్నారు.