Janasena chief Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన విశాల హృదయాన్ని మరోసారి నిరూపించుకున్నారు.ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలకు 25 లక్షల భారీ విరాళాన్ని ఇచ్చి ఆయన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు.ఇస్లాం విద్యాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దానియొక్క
ధార్మిక సంస్థలకు విరాళాలను ప్రకటించారు.మొదటినుండి పవన్ కళ్యాణ్ విద్యకు ప్రత్యేక స్థానం ఇస్తారు. ఆయన మతాలకు అతీతంగా ఇస్లాం విద్యకు ప్రోత్సహం కల్పిస్తూ మత సామరస్యాన్ని చాటుకున్నారు.ప్రకటించిన విరాళాల్లో ముఖ్యంగా..విజయవాడకు చెందిన “దారుల్ ఉలుమ్ హలేమియా వెల్ఫేర్ సొసైటీకి 5 లక్షలు.
అమరావతి కి చెందిన “జామీయా అతీఖుర్ రెహమాన్ లిన్ బనాత్ ఎడ్యుకేషన్ సొసైటీ” కి 5 లక్షలు.మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి దగ్గరలో ఉన్న “మసీద్ ఎ నూర్ ” కి 5 లక్షలు.కర్నూలు దర్గాకు మరియు కడప మసీదుకు చెరో 5 లక్షల చొప్పున పవన్ కళ్యాణ్ విరాళాలు ప్రకటించారు.
ఈ విరాళాలు అందించే బాధ్యతను పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ అర్హంఖాన్ కు, పార్టీ ప్రతినిధి శ్రీ అబిద్ లకు పవన్ కళ్యాణ్ అప్పజెప్పారు.తమ నాయకుడు తమ పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మైనారిటీ సోదరులు ఆనందంలో మునిగితేలుతుండగా,మతాలను అడ్డం పెట్టుకొని,
రాజకీయాలు చేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఇస్లాం విద్య కోసం, అభివృద్ధి కోసం తమ నాయకుడు భారీ విరాళాలు ప్రకటించి మంచి హృదయాన్ని చాటుకున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తున్నారు.