Janasena : వైసీపీ కార్యకర్తలు జనసేనకు వ్యతిరేకంగా పోస్టర్ల ప్రచారం చేసి ప్రశ్నించినందుకు జనసేన నాయకుల పైన కేసులు పెట్టిన విషయం మనకు విదితమే. అక్రమంగా జనసేన పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కుట్రపూరితంగానే వైసిపి ప్రభుత్వం ఈ రకంగా అక్రమ కేసులు బనాయించి తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేపిస్తున్నారని జనసేన పార్టీ
నుండి ఇప్పటికే వ్యతిరేకతతో కూడిన డిమాండ్లు మొదలయ్యాయి. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..ప్రజలను జగన్ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తూ, నమ్మించి మోసం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు జనసేన పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని కూడా తీసుకుంది అని మధుసూదన్ రావు అన్నారు.
ప్రజలు జగన్ కు తోడుగా ఎందుకు వుండాలి. ఇసుక దందా చేస్తున్నందుక..,లిక్కర్ మాఫియాకు సపోర్ట్ చేస్తున్నందుక..లేక రాష్ట్రాన్ని దోచుకునేందుకా.. ఎందుకు తోడుగా ఉండాలి అని వైసిపి ప్రభుత్వం తీరుపై అయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైసిపి దోపిడి బయటపడకూడదని ఫ్లెక్సీల నాటకం ఆడుతున్నారు.
తప్పుడు కేసులు బనాయిస్తే సహించేది లేదు, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేతిరెడ్డి నీకు ఓటు వేసినందుకు ధర్మవరం ప్రజలను శపిస్తున్నావా? ధర్మవరం ప్రజలకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే ప్రజలు నిన్ను క్షమించరు అని మధుసూదన్ రెడ్డి కేతిరెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు.