Janasena Complained on TTD Website : వేంకటాద్రితో సమానమైన ప్రదేశం మొత్తం విశ్వంలో లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దేవుడు గతంలోనూ లేడు, భవిష్యత్తులోనూ లేడు అన్నది హైందవ ధర్మం నమ్ముకం. హిందువులకు పరమ పవిత్రమైనది పావనమైనది తిరుమల తిరుపతి. కలియుగ దైవాన్ని దర్శించి ప్రసాదాన్ని స్వీకరించి తరించిపోతారు భక్తులు. తమ మెక్కులను తీర్చుకునేందుకు స్వామివారికి కైంకర్యాలు సమర్పించేదుకు స్వామికి జరిగే అనేక ఆర్జిత సేవలలో పాల్గోంటూ భక్తిపారవశ్యనికి లోనౌతారుభక్తులు.
ఆ పరమ పవిత్రమైన తిరుమల ఇప్పుడు అనేక అవకతవకలకు నిలయమైంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలు, వసతి, లడ్డు ఆమ్మకాలు ప్రతి దాంట్లో దళారి వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయింది. దేవాలయ పాలకపక్షం ఆండ దండలతొనే ఈ దళారివ్యవస్ద మరింత చెలరేగి పోతోంది. ఆగమ శాస్త్ర పద్దతులను సైతం తుంగలోకితొక్కి అధికారపక్షం అజమాయిషీ చెలాయిస్తోంది. తిరుమల తిరుపతిని ఆధ్యత్మిక పర్యాటక ప్రదేశం గా కాకుండా వ్యాపార కేంద్రంగా చూస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతోంది.

ఇటీవల తిరుమల తిరుపతి వెబ్ సైట్లో సైతం అక్రమాలకు అడ్డాగా మారింది. వెబ్‌సైట్‌పై తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. టీటీడీ వెబ్ సైట్‌లో దర్శనం, గదులు బుక్ చేసుకున్న భక్తులకు షాక్ తగులుతోందన్నారు. దర్శన టికెట్లకు తీసుకోవాల్సిన డబ్బులకంటే టీటీడీ అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. టీటీడీ జీఎస్టీ పరిధిలో ఉందా? లేక.. జగన్ ట్యాక్స్ పరిధిలో ఉందా? అని ప్రశ్నించారు. టీటీడీ వెబ్ సైట్‌ను వెంటనే క్లోజ్ చేసి కొత్త వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇంత జరుగుతున్నా టీటీడీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. భక్తుల నుంచి అధిక వసూళ్లపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై అనుమానం ఉందని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దీనిపై ఏం సమాధానం చెబుతారని అడిగారు. టీటీడీ కేసులు పెట్టడం, మంత్రులతో సిఫార్సులు చేయించుకోవడం మానుకుని భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ హితవుపలికారు.
