“మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు”
అనే గీతాన్ని, తెలుగు జాతీయ గీతంగా, తెలుగు జాతికి అందించిన శంకరంబాడి సుందరాచారి గారి 106వ జయంతి నేడు. వాల్మీకి రామాయణాన్ని ఆయన తెనుగీకరించారు. ఆయన గొప్పతనం ఏమిటంటే, పుట్టుకతో బ్రాహ్మణుడు. కానీ కులాల వివక్ష పైన నిశ్చితాభిప్రాయం కలిగిన శంకరంబాడి సుందరాచారి గారు, తనకు రెండో జన్మలా భావించే జన్యం తాడుని విసర్జించి, ఒక కుక్కకు దానిని తగిలించి, తనకు కులము అనేది లేదనే సందేశం సమాజానికి గట్టిగా చెప్పటం అయన ఘనత. వృత్తి థర్మం కాకుండా ఒక రైల్వే కూలిగా, హోటల్ సర్వర్ గా జీవనం సాగిస్తూ, నాడు ఆంధ్ర పత్రిక నడుపుతున్న కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి లాంటి వారిని మాటలతో ఢీ కోని ఉద్యోగం సంపాదించి, తన రచనా ప్రసంగ యాత్రని కోనసాగించారు.
అటువంటి శంకరంబాడి సుందరాచారి గారు చూపిన మార్గం, జాతికి అందించిన గీతం, జనసేన పార్టీ సదా ఆచరిస్తుంది, గౌరవిస్తుంది అనీ, జనసేన పార్టీ మొదటి మూల సిద్దాంతం అయిన “కులరహిత సమాజ స్థాపన” నాడే అమలు చేసిన వారిని స్మరించుకోవటం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమనీ జనసేన లీగల్ అడ్వైజర్ శాంతి ప్రసాద్ సింగలూరి ఒక ప్రకటన లో తెలిపారు..
