Janasena : “ఆరెంజ్” చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయాన్ని జనసేనకు మద్దతుగా అందజేత. ఆరెంజ్ సినిమా రెండోసారి ప్రదర్శించిన సందర్భంగా ఆ సినిమా పైన వచ్చిన ఆదాయాన్ని అనగా రూ. 1.05 కోట్లు ఆదాయాన్ని జనసేనకు అందజేసి మద్దతు పలికారు. ఈ సినిమాను నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఆరెంజ్ చలనచిత్రాన్ని రెండవ మారు ప్రదర్శించారు. రెండోసారి ప్రదర్శన కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి, రామ్ చరణ్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున మంచి స్పందన లభించింది. జనసేన పార్టీ అభిమాన కార్యకర్తలు పార్టీకి మద్దతు తెలపడం కొరకు, ఆరెంజ్ సినిమా మీద వచ్చిన ఆదాయాన్ని పార్టీకీ విరాళంగా అందజేశారు.
పార్టీ అభిమానులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల నాగబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరెంజ్ చలనచిత్రం రెండవసారి ప్రదర్శనకు కీలక భూమిక పోషించిన సాయి రాజేష్, ధర్మేంద్ర, ఎస్.కె.ఎన్., శివచెర్రీ, శ్రీనాధ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ తదితరులను నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు.
పార్టీ కార్యచరణ కోసం, పార్టీకి ఇంత మద్దతుగా నిలిచిన ఆరెంజ్ సినిమా ప్రదర్శన టీంకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.