Janasena : జనసేన పార్టీ కార్యకర్త సదాశివుని రాజేష్ హత్యకు గురికాబడ్డాడు. జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శివశంకర్ డిమాండ్ ఈ హత్య గురించి మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి వాస్తవ్యుడు సదాశివుని రాజేష్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్త. పవన్ కళ్యాణ్ గారి భావజాలం అన్నా, ఆయన సిద్ధాంతం అన్నా రాజేష్ కి చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేది.
అటువంటి రాజేష్ సామాజిక బాధ్యత, స్పృహతో అరసవెల్లి ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా గురించి ప్రశ్నించినందుకు. అధికార ప్రభుత్వం, జనసేన పార్టీ కార్యకర్తను హత్య చేయించడం ఎంతవరకు సమంజసం అని శివశంకర్ అన్నారు. ఈ హత్యతో ప్రభుత్వం యొక్క తీరు మనకు కనబడుతుంది. అక్రమ దోపిడీని నివారించాల్సిన ప్రభుత్వమే, ఈరోజు

వాటికి కొమ్ముకాయటం, అక్రమ దోపిడీకి సపోర్టుగా ఉండడం ప్రభుత్వం యొక్క తీరును వెలిబుచ్చుతుంది అని ఆయన అన్నారు. అక్రమ దోపిడీని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇలా చంపేస్తుందా..? ఇది ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం.. ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను చూస్తూ ఊరుకోవాలా..? అని శివశంకర్ ప్రశ్నించారు.
బాధ్యత గల పౌరులు ఎవరు అలా ఊరుకోరు. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అక్రమాన్ని ప్రశ్నించకుండా ఉండరు. తక్షణమే రాజేష్ హత్య గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి హంతకులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివశంకర్ డిమాండ్ చేశారు. రాజేష్ హత్య వెనుక ఉన్న నిందితులు ఎవరనేది పోలీసులు వెంటనే గుర్తించాలి.

ఇద్దరూ లొంగిపోయారని పోలీసులు చెబుతున్నారు. కానీ అసలు వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనేది వారు కనిపెట్టాలి. హత్యకు ప్రేరేపించింది ఎవరు? అక్రమ ఇసుక రవాణా చేస్తుంది ఎవరు.. అనేది పోలీసులు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి వారిని శిక్షించాలి. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియోలజీ వారు ఏం చేస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సింది పోయి వారు మౌనం వహించారు. ఈ అక్రమ రవాణా గురించి పోలీసులకు సమాచారం అందకుండా ఉంటుందా. పోలీసులు ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాలను ఆపివేయాలి. రాజేష్ హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని శివశంకర్ తెలిపారు.
