Janasena TDP War on Drought : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టిడిపి, జనసేన కలిసి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని, ఒకటే అభిప్రాయంతో ముందుకు వెళుతున్నాయి. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం పై పోరాడేందుకు తొలి ఉమ్మడి కార్యచరణగా ఏపీలో కరువు పరిస్థితులపై పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏపీవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వైసిపి ప్రభుత్వం కరువు నష్టం అంచనా వేయడంలో విపులమైందని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
దాదాపు 50 మండలాల్లో కరువు ప్రభావం తీవ్రంగా ఉన్న కేవలం 14 మండలాల్లోనే కరువు ఉందని వైసీపీ ప్రభుత్వం చెప్పి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, ఏపీవ్యాప్తంగా 32 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, గత రెండు నెలలుగా సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో, పంటలు చాలా చోట్ల దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

కానీ ప్రభుత్వ మాత్రం రైతులకు ఎటువంటి నష్టపరిహారాన్ని అందించకపోగా, తప్పుడు లెక్కలను చూపించి రైతులను మోసం చేస్తుంది అని టిడిపి, జనసేన పార్టీలు విమర్శించారు. కొద్దిరోజుల క్రితం ఏపీ క్యాబినెట్ సమావేశంలో కూడా కరువు పరిస్థితులపై వైసీపీ మాట్లాడలేదని ఈ రెండు పార్టీలు ఆరోపించాయి. ఈనెల 14 ,15, 16వ తేదీల్లో నియోజకవర్గాల స్థాయిలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించనుంది. అక్కడ కూడా నియోజకవర్గాల వారీగా కరువు పరిస్థితులపై పోరాటం చేసి, భారీ ఎత్తున రైతుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు జనసేన టిడిపి పార్టీలు.
