Janasena vs BJP : ఒకవైపు ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుంది. బిజెపి – జనసేన పార్టీల మధ్య పరిస్థితి ఏంటి అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఈ రెండు పార్టీలు పేరుకే పొత్తు అన్నట్టుగా ఉన్నాయి ,ఇప్పటివరకు రెండు పార్టీలు కలిసి ఎలాంటి ఉమ్మడి కార్యక్రమాలు, ఉమ్మడి ప్రకటనలు చేయలేదు.
ముఖ్యంగా బీజెపి ప్రవర్తనతో పవన్ కళ్యాణ్ చాలా నిరాశక్తిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో టిడిపి తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనను,బిజెపి గ్రహించి మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది.వాస్తవానికి గతంలోనే పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి ముందుకు వెళ్లే విషయం పై ప్రకటన చేశారు.
బిజెపి ఇచ్చే రూట్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నాను అని చెప్పారు. కానీ దీనిపై బీజేపీ మాట మరో రీతిగా ఉంది. ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దియోధర్ బిజెపి తరపున జనసేనకు అన్ని రోడ్ మ్యాప్ లు మేము ఇచ్చేసాము, ఈ విషయంపై క్లారిటీ పవన్ కళ్యాణ్ నే ఇవ్వాలి అని మీడియాకు చెప్పారు.
ఈ వ్యాఖ్యలతో పొత్తు విషయం భారం అంతా జనసేన మీదనే బీజేపీ వదిలినట్టు కనిపిస్తుంది.కోన్నీ రోజుల క్రితం పవన్ ఢిల్లీకి వెళ్లి అక్కడే రెండు రోజులు ఉండి బీజేపీ అగ్రనేతలను కలిసే ప్రయత్నం చేసారు. కానీ అది సాధ్య పడలేదు.దాంతో పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్ ను, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసారు.
కర్ణాటక ఎన్నికలలో ప్రచారం కోసమే పవన్ కళ్యాణ్ తో మాట్లాడడాం కొరకు బిజెపి ఢిల్లీకి పిలిచిందని ప్రచారం ఏపీలో విస్తృతంగా జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపైనర్ల లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో, అప్పట్లో బీజేపీని కలిసింది కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాదని, ఏపీలోని వ్యవహారాల గురించి చర్చించడానికి అని స్పష్టమైంది.
ఈ వరుస సంఘటనలతో పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకోవడం బిజెపికి ఇష్టం లేనట్టుగా తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే ఏపీ ఎన్నికల్లో జనసేన , టిడిపి మాత్రమే కలిసి పోటీ చేస్తాయనే విషయం అర్థమవుతుంది.