Janhvi Kapoor: అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసిన జాన్వీ కపూర్.. మీరూ చూసేయండి!
Janhvi Kapoor: బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ తన నటనతో, అందంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. తాజాగా అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో కనిపించి కవ్వించారు. ఒక ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ముస్తాబైన జాన్వీ కపూర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండీ వేర్‌లో జాన్వీ అందం రెండింతలు అయ్యిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ, తన తండ్రి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ప్రోత్సాహంతో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లోని పెద్ద ఫ్యామిలీ, బలమైన సినీ నేపథ్యం ఉన్నప్పటికీ జాన్వీ కపూర్‌కు అవకాశాలు అంత తేలిగ్గా దక్కలేదు. ఇందుకోసం ఆమె ఎంతో కష్టపడ్డారు, అవమానాలు భరించారు. కానీ విమర్శలు ఎదుర్కొన్న చోటే గెలిచి తన సత్తా చాటారు. ఇప్పుడు జాన్వీ కపూర్ అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్.
ధడక్, గుడ్ లక్ జెర్రీ, మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మహి వంటి చిత్రాలతో ఆమె తన నటనను నిరూపించుకున్నారు. గ్లామర్ పాత్రలు చేస్తూనే, నటనా ప్రాథాన్యమున్న పాత్రల్లో నటించాలని జాన్వీ కపూర్ భావిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. బాలీవుడ్‌లో నటిస్తూనే తన తల్లి కోరిక మేరకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరలో హీరోయిన్‌గా నటించి.. డెబ్యూ మూవీతోనే టాలీవుడ్‌లో హిట్ అందుకున్నారు.

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానాల కాంబోలో తెరకెక్కుతోన్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉండే జాన్వీ, తన రోజువారీ జీవిత విశేషాలను, కొత్త ప్రాజెక్ట్‌ల అప్‌డేట్‌లను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటోకు భారీగా లైక్స్, కామెంట్లు
