Janhvi Kapoor: అతడే నా హస్బెండ్.. ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన జాన్వీ కపూర్
Janhvi Kapoor: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు పెళ్లయిందని, తన స్నేహితుడు ఓరి (ఓర్హాన్ అవత్రామణి)ని తన భర్తగా పరిచయం చేశానని ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
కొరటాల శివ రూపొందించిన ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ కపూర్, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తూ టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ‘పరమ్ సుందరి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మొదటి ప్రేమ, డేటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
“విదేశాలకు వెళ్లినప్పుడు చాలాసార్లు కొంతమంది యువకులు నాకు అనవసరంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించేవారు. హోటల్ రూమ్‌కు ఆహారం పంపించడం, అడగకుండానే నంబర్లు ఇవ్వడం వంటివి చేసేవారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి నాకు వివాహమైందని చెప్పేదాన్ని. ఒకసారి ఓరితో ఉన్నప్పుడు, అతనే నా భర్త అని చెప్పాను” అని జాన్వీ కపూర్ తెలిపారు. ఈ విధంగా తనకు పెళ్లయ్యిందని చెప్పి అవాంఛనీయమైన అడ్వాన్స్‌లను తప్పించుకున్నానని ఆమె వెల్లడించారు. ఈ నిజం విన్న వారంతా షాక్‌కు గురయ్యారు. జాన్వీ వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య ఫన్ క్రియేట్ చేసింది.
కాగా.. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ ఒక పంజాబీ అబ్బాయిగా, జాన్వీ ఒక కేరళ యువతిగా నటించారు. విభిన్న సంస్కృతుల నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ అభిమానులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.