రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడు కానీ అప్పట్లో శివ సినిమాతో టాలీవుడ్ గతినే మార్చేశాడు. అటు బాలీవుడ్ కు వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్లు తీసి దేశం మొత్తం తన వైపు చూసే చేసాడు. ప్రస్తుతం వర్మ సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు వర్మ తీసిన చిత్రాలన్నీ కల్ట్ క్లాసిక్‌గానే మిగిలాయి. అయితే ఇటీవల ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించాడు. సుభాష్ ఘయ్ అనే బాలీవుడ్ డైరెక్టర్ యువరాజ్ అనే సినిమా కోసం ఏఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడట.
రెహమాన్ ఇవ్వాల్సిన పాట ఆలస్యం కావడంతో సుభాష్ ఘయ్ రెహమాన్ కి కాల్ చేసి “సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మీద సాంగ్ షూట్ కి ప్లాన్ చేసాము, సెట్ కూడా రెడీగా ఉంది, మళ్లీ వాళ్ళ డేట్స్ మిస్ అయితే నేను చాలా నష్టపోవాల్సి వస్తుంది అని కొంత అసహనాన్ని వ్యక్తం చేయగా..” సరే రేపు నేను పలానా టైంకి ఓ స్థూడియోకి వస్తున్నాను అక్కడికి రా నీకు సాంగ్ ఇచ్చేస్తాను అని చెప్పాడట.”
సరే అని డైరెక్టర్ సుభాష్ ఆ స్థూడియోకి వెళ్లేసరికి అక్కడ సుఖ్విందర్ సింగ్ ఒక సాంగ్ చేస్తూ కనిపించాడు, అతనిని ఎవరికి ఆ పాట అని అడగగా “మీకు సాంగ్ అర్జెంట్ గా కావాలని ఆడిగారంట కదా మీకోసమే చేస్తున్నా” అని చెప్పగానే సుభాష్ కి కోపం తారా స్థాయికి చేరింది. ఈ లోపు ఏఆర్ రెహమాన్ రావడంతో.. నేను నిన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంది నువ్వు సాంగ్స్ చేసి ఇస్తావని కానీ, ఎవరితోనో చేయిస్తావా అని గొడవకు దిగాడట.
అప్పుడు ఏఆర్ రెహమాన్ నింపాదిగా ఇలా అన్నాడట.. “మీరు నా పేరు వాడుకుంటున్నందుకు నాకు డబ్బులు ఇస్తున్నారు అంతే కానీ నేనే సంగీతం చేసి ఇవ్వాలని కాదు. మీకు ఈ పాట నచ్చితే తీసుకోండి, లేదా ఇంకోటి చేసి ఇస్తాడు అని చెప్పాడట.” ఆ పాట సుభాష్ ఘయ్ కి నచ్చకపోవడంతో తను సంగీత దర్శకత్వం వహిస్తున్న ఒక విదేశీ చిత్రానికి అమ్ముకున్నాడు ఏ ఆర్ రెహ్మాన్. ఆచిత్రం పేరు “స్లమ్ డాగ్ మిలీనియర్” ఆ పాట మరేదో కాదు ఏ ఆర్ రెహమాన్ కి ఆస్కార్ తీసుకొచ్చి, తనకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన “జయహో” సాంగ్. మొత్తానికి సుఖ్విందర్ సింగ్ కంపోజ్ చేసిన సాంగ్ కి రెహమాన్ ఆస్కార్ అందుకున్నాడన్న మాట..!
