Jayam Ravi: విడాకుల వివాదం నడుమ జయం రవి కొత్త ప్రయాణం.. భార్య ఆర్తి సంచలన పోస్ట్!
Jayam Ravi: కోలీవుడ్ నటుడు జయం రవి ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నారు. భార్య ఆర్తితో విడాకుల వివాదం కొనసాగుతుండగా, గాయని కెన్నీషాతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. తాజాగా, జయం రవి కెన్నీషాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ జంట ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ పరిణామాలపై జయం రవి భార్య ఆర్తి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. “నువ్వు ఇతరులను మోసం చేయవచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ దేవుడిని మోసం చేయలేవు” అంటూ ఆమె పరోక్షంగా తన భర్తపై విమర్శలు గుప్పించారు. కెన్నీషా వల్లే తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయని ఆర్తి ఆరోపిస్తున్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తుండగా, ఆర్తి భరణం కింద రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
కొత్త నిర్మాణ సంస్థతో ముందడుగు..
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, జయం రవి తన కెరీర్‌లో కీలక ముందడుగు వేశారు. ‘రవి మోహన్ స్టూడియోస్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ లాంఛ్ ఈవెంట్‌కు ఆయన ప్రేయసిగా ప్రచారం జరుగుతున్న కెన్నీషాతో కలిసి రావడం గమనార్హం. ఈ వేడుకకు శివరాజ్ కుమార్, కార్తీ, సూర్య, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
https://x.com/RaviMohanStudio/status/1960233339841098004
రెండు కొత్త సినిమాలు..
ఈ సందర్భంగా రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించబోయే తొలి రెండు సినిమాలను కూడా ఆయన ప్రకటించారు. మొదటి సినిమాలో జయం రవి హీరోగా కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించనున్నారు. రెండవ సినిమాలో హాస్యనటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు స్వయంగా జయం రవి దర్శకత్వం వహించనుండటం విశేషం.
