సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జేఈఈ పరీక్ష, సెప్టెంబర్13 NEET పరీక్షల తేదీని విద్యాశాఖ విడుదల చేసింది. JEE మెయిన్స్ పరీక్ష 8 లక్షల 58 వేల మంది విద్యార్థులు, NEET పరీక్ష 15 లక్షల 97 వేల మంది విద్యార్థులు రాయనున్నారు. ఇప్పటికే కరోనా దృష్ట్యా పరీక్షల వాయిదాకు పార్టీలు, ప్రతిపక్ష సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణను ఆపివేయడానికి సుప్రీంకోర్టును ప్రతిపక్షాలు ఆశ్రయించే యోచనలో ఉన్నాయి.
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వరదల కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేయాలని ప్రధాని మోడీ కి ఫోన్ ద్వారా తెలిపారు.
పరీక్షలు నిర్వహించాలంటూ 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని మోదీకి లేఖ రాశారు. సుప్రీం కోర్టు ఇప్పటికే ఆరు నెలల సమయం వృధా అయిందని పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వగా, ఇతర రాష్ట్రాల ప్రతిపక్షాలు కరోనా దృష్ట్యా నిలిపివేయాలని కోరుతున్నాయి. కొంతమంది విద్యార్థులు పరీక్షలు నిలిపివేయాలని ఆన్లైన్లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. ఇలా ఉండగాJEE మెయిన్స్ పరీక్షకు 9:30 లక్షల మంది విద్యా ర్థులు ఉండగా, 7:30లక్షల మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారని, అలానే NEET పరీక్షకు 13 లక్షల మంది ఉండగా 9 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపుతున్నారని కేంద్ర విద్యా శాఖ మంత్రి తెలిపారు.
ఈ పరీక్షలు ఆయా తేదీల్లో జరగనున్నాయా లేదా ఏమైనా మార్పు జరగవచ్చా అనేది వేచి చూడాల్సి ఉంది.