Jyothula Chanti Babu with Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో జగ్గంపేట వైసిపి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు భేటీ
పవన్ కళ్యాణ్ తో జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బేటి అయ్యారు. జనసేనాని తో ఆయన దాదాపు గంటపాటు చర్చలు జరిపినట్లు సమాచారం అందుతుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడలో బస చేసిన పవన్ కళ్యాణ్ గారిని రాత్రి పది గంటల సమయంలో చంటిబాబు వచ్చి కలిశారు.
ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఎక్కడినుండో తెలుసా..!
జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలను వైసిపి అధిష్టానం మారుస్తోందన్న చర్చ నడుస్తున్న సమయంలో చంటిబాబుకి ఈసారి టికెట్ లేదని ఊహాగానాలు ఉన్నాయి. దీనితో ఎమ్మెల్యే చంటిబాబు వర్గీయులు సీఎం జగన్ తీరుపై నిరసనలు తెలిపారు. ఇప్పటికీ కొందరు పార్టీకి పదవులకి రాజీనామాలు చేయగా.. ఎమ్మెల్యే సైతం తనతో ఉన్నవారి మనోభావాలు దెబ్బతినకుండా వైసిపి పార్టీ ప్రవర్తిస్తే బాగుంటుందని అధిష్టానాన్ని హెచ్చరించారు. సరిగ్గా ఇలాంటి సమయంలో పవన్ తో చంటిబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.