Kamareddy : కాసేపట్లో అంత్యక్రియలు.. ఇంతలోనే ఊహించని షాక్ ఇచ్చిన కాటికాపరి..!!
కామారెడ్డి జిల్లాలో కాటికాపరి వింత పోకడ.. డబ్బుల కోసం బెదిరింపు ధోరణి చూసి జనాలు నివ్వెరపోతున్నారు..
ఇంట్లో ఎవరైనా చనిపోతే.. ఆ కుటుంభం పుట్టెడు దుఃఖం లో ఉంటుంది. ఎటు చూసినా ఒకరకమైన గంభీర వాతావరణం అలుముకుంటుంది ఆ కుటుంభంలో.. వీలైతే కన్నీరు బొట్లు కార్చడం తప్ప చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాం..ఇక ఆ తరువాత జరిగే తంతు తెలిసిందే కదా…
అంత్యక్రియలకి ఏర్పాటు చేసి అంతిమ వీడ్కోలు పలకాలి అని..వస్తున్న కన్నీళ్ళని అదిమి పెడుతూ ముందుకు సాగుతూ…శోక సంద్రంలో ఉన్న ఆ కుటుంభానికి వింత అనుభవం ఎదురైంది స్మశానంలో కాటికాపరి రూపంలో.. ఎవరైనా చనిపోతే.. అట్టి చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు లేదా సమాధి లో పూడ్చి పెట్టే కార్యక్రమం అంతా కాటికాపరి ఆధ్వర్యంలోనే జరుగుతుంది..
కామారెడ్డి జిల్లాలో ఊహించని ఘటన..
అంత్యక్రియలలో భాగంగా ఆ కాటికాపరి చనిపోయిన వ్యక్తి చితి దగ్గరికి చేరుకొని.. ఇచ్చిన డబ్బులు చాల్లేదని ఆ చితిపై పడుకొని “నాకు 5000 లు ఇవ్వాలి.. లేకుంటే చితిపై నుండి లేవనని “భీష్మించుకొని కూర్చున్నాడు.
చివరికి ఏమీ చేయలేక మృతుని కుటుంభ సభ్యులు 2000 ఇవ్వడం తో.. ఆ కాటి కాపరి అడ్డు తప్పుకున్నాడు.
అయితే కాటికాపరి శైలిపై పలువురు నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు
