Kanchipuram Fire Crackers Factory : పండుగ పూట విషాదం…బాణాసంచా తయారీ కేంద్రం లో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
పండుగ వేళ పెను విషాదం చోటుచేసుకుంది. తమిళనాడు -చెన్నై సమీపంలోని కాంచీపురం వద్ద గల భాణాసంచ తయారీ కేంద్రంలో తాజాగా భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులని హుటా హుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పేలుడు సంభవించిన సమయంలో, బాణాసంచా తయారీ కేంద్రంలో 30 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ప్రమాదం జరిగిన చోటుకి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలని అదుపు చేస్తున్నారు.
