Kangana Ranaut Shocking Comments : ఎప్పుడు వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ మరోసారి తాజాగా నెటిజెన్లతో తిట్ల వర్షం కురిపించుకుంటుంది. ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చాలా ఫాస్ట్ గా ఉంటుంది. తను ఒకటి అంటే నెటీజన్స్ మరోలా అర్థం చేసుకోవడం, నేను అన్నదాని భావం అది కాదు అని తను సర్థి చెప్పడం. లేకపోతే తను చెప్పిందే నిజం అనే లాగా అమ్మడు వాదన ఉండడం ఇవన్నీ కూడా కంగనాను ఎప్పటికీ చిక్కుల్లో పడేస్తూనే ఉంటాయి.
చాలాసార్లు కంగనాను నేటిజెన్లు కామెంట్స్ తో ఏకిపారేశారు. కంగనాకి నోరు దగ్గర పెట్టుకోవడం రాదని నోటికి వచ్చినదల్లా వాగుతూ ఉంటుందని చాలామంది కంగనాకు చూస్తేనే ఇంత ఎత్తున లెగుస్తారు. ఈ నేపథ్యంలో కంగనా మరోసారి వార్తల్లోకి ఎక్కి మరింత హల్చల్ చేస్తుంది. కానీ ఏదో పబ్లిసిటీ కోసం చేస్తుందా అన్నట్టుగా ఉంటాయి తను చేసే కామెంట్స్.
చాలామంది కూడా పని లేకపోతే ఇలాంటివి కంగనా ఎక్కువగా చేస్తుంది. తనకి నోటి దురద ఎక్కువ అని డైరెక్ట్ గానే కామెంట్ చేశారు. అయితే తాజాగా జయలలిత గురించి కంగనా తనకున్న ఒక అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక నెటిజన్లు ఊరుకోకుండా జయలలితతో నీకు పోలిక ఏంటి అని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టి కంగానను ఒక రేంజ్ లో ఆటాడేసుకున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే, “జయలలిత బయోపిక్ లో నటించినప్పటి నుండి నాకు కూడా రాజకీయాల మీద ఇష్టం పెరిగింది. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి జయలలిత లాగా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఆమెలాగా ఎదగాలి అనేదే నా తాపత్రయం. ఆ కోరికను నెరవేర్చుకుంటాను మా నాన్నగారు కూడా జయలలిత గురించి చాలా చెప్పేవారు. తను నాకు ఒక రోల్ మోడల్” అని ఈ విధంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది.
ఇక అది చూసినన నెటిజెన్స్ నువ్వెక్కడ,జయలలిత ఎక్కడ. ఇంకోసారి తనతో పోల్చావంటే బాగోదు అని చాలా సీరియస్ గా కామెంట్ చేస్తున్నారు. తన అభిప్రాయాన్ని చెప్పిన కూడా నేటిజన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారంటే కంగనా ఇదివరకు చేసిన టాక్స్ ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
