NTR కి వెన్నుపోటు వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు. బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్2 కి గెస్ట్ గా వచ్చిన చంద్రబాబు కు బాలక్రిష్ణ కూ మధ్య సరదా సంభాషణలతో బాటు ఈ వెన్నుపోటు వ్యవహారం కూడా మరో సారి తెరపైకి రావడంతో దీనిపై స్పందించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు.
బావా, బామ్మర్ది ఇద్దరూ ఒక టీవీ షోలో కూర్చుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపై అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్టు ప్రచారం చేయటం సిగ్గుచేటు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు మీద బాలకృష్ణను కాదు ప్రజలను అడిగితే చెబుతారు. అసలు దేనికోసం వెన్నుపోటు పొడిచావో ఎందుకు చెప్పవు బాబూ అని ఎడాపెడా వాయించారు కన్నబాబు.
వెన్నుపోటు పొడిచిన మీరే ఒక టీవీ షోలో కూర్చుని మాట్లాడుకుంటూ మీకు మీరే కితాబులు ఇచ్చుకుంటే అదే నిజం అని నమ్మేసి, జనం చప్పట్లు కొడతారు అనుకుంటే అది మీ పిచ్చితనమే బాబు అన్నారు. మీరు ఒకరికొకరు పొగుడుకున్నంత మాత్రాన, చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాకుండా పోడు అని సెటైర్లు వేశారు కన్నబాబు.