Rukmini Vasanth: మల్టీ టాలెంటెడ్ రుక్మిణి వసంత్.. ఈ అందాల ముద్దుగుమ్మ అడ్వెంచర్ సర్ఫింగ్ కూడా చేస్తుందా?
Rukmini Vasanth: కన్నడ, తెలుగుతోపాటు పాన్-ఇండియా స్థాయిలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నటి రుక్మిణి వసంత్. ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంలో ఆమె పోషిస్తున్న పాత్రే దీనికి ప్రధాన కారణం. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఆమె ఈ సినిమా ప్రమోషన్స్, షూటింగ్స్ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుని రిలాక్స్ అవుతున్నారు.
నిత్యం షూటింగ్స్, ప్రమోషన్స్ బిజీ షెడ్యూల్స్‌తో గడిపిన రుక్మిణి వసంత్, సినిమా విడుదల ముంగిట కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమె బ్లాక్ స్పోర్ట్స్ వేర్‌లో సముద్ర తీరాన సర్ఫింగ్ చేస్తున్న వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్ర అలలను చూసి ఏ మాత్రం భయపడకుండా, చాలా ధైర్యంగా సర్ఫ్‌బోర్డుపై రైడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సాహసోపేతమైన రైడ్‌లో ఆమె ఒక ప్రొఫెషనల్ అథ్లెట్‌లా కనిపించారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఈ వెకేషన్‌ను ఎంజాయ్ చేసినట్లు కూడా ఆమె తెలిపారు.
ఈ సర్ఫింగ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుక్మిణి వసంత్ నటించిన కన్నడ చిత్రం ‘బానదారియల్లి’ సెప్టెంబర్ 28తో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ పోస్ట్ చేశారు. అయితే, ఆమె ఏ ప్రాంతంలో వెకేషన్‌కు వెళ్లారనేది మాత్రం తెలియజేయలేదు. మొత్తానికి, ‘కనకవతి’ పాత్రలో కనిపించబోతున్న రుక్మిణి వసంత్ రిలాక్స్‌డ్ మూడ్ లో ఉన్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
కాగా.. కాంతార చాప్టర్ 1 హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, రిషబ్ శెట్టి కథ, దర్శకత్వం, ప్రధాన పాత్రను పోషించారు. ఈ ప్రీక్వెల్‌లో యువరాణిగా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, దిల్షాన్ దేవయ్య కీలక పాత్ర పోషించారు.
