Kantara Chapter1: ‘కాంతార: చాప్టర1’ నుండి కనకవతి వచ్చేసింది.. మీరు చూశారా?
Kantara Chapter1: 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా విజయం తర్వాత, దాని ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ఈ సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. సినిమాలో కథానాయికగా నటిస్తున్న రుక్మిణి వసంత్ ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేస్తూ, ఆమె పాత్ర పేరును ‘కనకవతి’గా ప్రకటించారు.
విడుదలైన పోస్టర్లో రుక్మిణి వసంత్ రాజసమైన, శక్తివంతమైన లుక్‌లో మెరిసిపోతోంది. ఆమె పోషిస్తున్న ‘కనకవతి’ పాత్ర సినిమా కథలో కీలక స్థానాన్ని పోషిస్తుందని చిత్రబృందం వెల్లడించింది. మొదటి భాగం విజయంలో కీలక పాత్ర పోషించిన కథా నేపథ్యం, సాంప్రదాయాలు, ప్రకృతితో ముడిపడిన అంశాలు ఈ ప్రీక్వెల్‌లో కూడా కొనసాగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. రూ.16 కోట్లతో తెరకెక్కి రూ.450 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించిన ‘కాంతార’ తర్వాత, దాని మూల కథను చెప్పే ‘కాంతార చాప్టర్ 1’పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రానికి హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తుండగా, అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ‘కాంతార’ మాదిరిగానే ఈ సినిమా కూడా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ సహా వివిధ భాషల్లో విడుదల కానుంది. రుక్మిణి వసంత్ లుక్ విడుదల తర్వాత సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. రిషబ్ శెట్టి విజన్, బలమైన పాత్రలు, అద్భుతమైన సాంకేతిక విలువలతో ‘కాంతార చాప్టర్ 1’ ఈ ఏడాది అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలవవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
https://x.com/rukminitweets/status/1953660124146598152
పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. అంతే కాదు ఈ మూవీ తర్వాత కాంతారా పార్ట్ 3 కూడా రాబోతుందని చెబుతున్నారు. ఆ మూవీలో ఎలాంటి స్టోరీని చూపిస్తారో అని ఇప్పటినుంచే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అలాగే ఈ హీరో తెలుగులోని పలు చిత్రాల్లో కీలకపాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
