ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం జరిగాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి మరియు కోస్తాంధ్రలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో బీజేపీ వారిపై దృష్టి సారించింది.
సోము రంగంలోకి దిగాక ఆయన తనకున్న పరిచయాలతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పెద్ద ఎత్తున బీజేపీలోకి చేర్చేందుకు వ్యూహం రచిస్తున్నట్టు భావిస్తున్నారు. జనసేన పార్టీతో పొత్తు మరియు ఇతర వర్గాల్లో కొంతమంది కీలకమైన నాయకులని ఆకర్షించి చెల్లాచెదురుగా ఉన్న ఓటు బ్యాంకుని సమీకృతం చేసి మెరుగైన ఫలితాలు సాదించేందుకు ప్రయత్నాలు త్వరలోనే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
కొత్త ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఇకముందు ఎలా వ్యవహరిస్తోందనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, వీర్రాజు దూకుడుగా ముందుకు పోవడంతో కమల నాధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.