Kashmira shah:మద్యం మత్తులో హంగామా చేసిన బాలీవుడ్ కపుల్స్ ….ఏకంగా ఏం చేశారంటే …??
భారతదేశంలో కూడా పాశ్చాత్య సంస్కృతికి ఏమాత్రం తగ్గకుండా ప్రవర్తిస్తున్నారు నేటి జనాలు. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా, చుట్టూ ఎవరూ లేనప్పుడే ముద్దు ముచ్చట్లు ఆడుకునే ప్రేమికులు నేడు బహిరంగంగా అందరూ చూస్తుండగానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.అయితే ఈరోజుల్లో ప్రేమికులకి ఇలాంటివి సాధారణమే అనుకొని మనలో మనమే సర్దిచెప్పుకోక తప్పలేని పరిస్థితి. అయితే పేరున్న సెలెబ్రిటీలు, సినీ రంగానికి చెందిన వారు, అందులో పెళ్ళైన జంటలు కూడా అప్పుడప్పుడు పబ్లిక్ అంతా చూస్తుండగా బహిరంగంగా ఇలా చేస్తుంటే, వారిని అభిమానించే అభిమానులు , నిత్యం ఫాలో అయ్యేవారి పరిస్థితి ఏంటన్నదే పెద్ద ప్రశ్న.పైగా ఇదేనా మన సంస్కృతి..?? ఇది పాశ్చాత్య సంస్కృతి కాక మరేమిటి అని కూడా అనుకుంటున్నారు జనాలు
తాజాగా బాలీవుడ్ నటి కశ్మీరా షా ఏకంగా మద్యం తాగి, ఆ మద్యం మత్తులో అందరూ చూస్తుండగానే తన భర్త అయిన కృష్ణ అభిషేక్ కి లిప్ లాక్ ఇచ్చేసింది.ఓ ఫంక్షన్ కి వెళ్లిన ఈ ఇరువురుని అక్కడ ఉన్న మీడియా పలకరించగా, ఫొటోలకి ఫోజులు ఇస్తున్న కశ్మీరా ని భర్త అభిషేక్ చేయి పట్టి తీసుకెలుతుండగా… గట్టిగా అతడిని తన దగ్గరికి లాక్కొని లిప్ లాక్ ఇచ్చేసింది.. ఇక ఇప్పుడు ఈ సంగతి నెట్టింట వైరల్ గా మారింది.