నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత మొదటి రౌండ్లోనే ఘన విజయం సాధించారు.
2014లో నిజామాబాద్ ఎంపీ గా కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ పై 1లక్ష డబ్బై 2 వేల నూట ఇరవై ఓట్లతో గెలిచిన కవిత ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయారు. ఈరోజు జరిగిన నిజామాబాద్ ఇందూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి కవితా బరిలో ఉండగా ఆమెకు పోటీగా బిజెపి నుండి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ వైపు నుండి సుభాష్ రెడ్డి పోటీ చేసారు. టిఆర్ఎస్ కు 728 ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ బిజెపి నుండి 100 మందికి పైగా టిఆర్ఎస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ బిజెపి సొంత పార్టీల నుండి టిఆర్ఎస్ కు 728, బిజెపికి 56, కాంగ్రెస్ కు 29 ఓట్లు వచ్చాయి చెల్లని ఓట్లు 10 గా మిగిలిపోయాయి.
14న ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో కవితకు మంత్రి చోటు దక్కనున్నట్లు టిఆర్ఎస్ పార్టీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ఇలానే కారు దూసుకుపోతుందని ఘనవిజయం సాధిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.