తెలంగాణా సీఎం కేసీఆర్ విజయవాడ రానున్నారు. అక్టోబర్ 14 నుండి విజయవాడ లో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభలలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలలో ఆయాన తో బాటు కేరళ, బీహార్ సీఎం లతో బాటు దాదాపు 20 దేశాలకు చెందిన కమ్యూనిస్టు నేతలు హాజరు కానున్నారు.
తెలంగాణా సీఎం కేసీఆర్ చివరిసారి మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు విజయవాడ వచ్చారు.
