దుబ్బాక ఉప ఎన్నికల పోరులో అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న రాత్రి బండి సంజయ్ ను సిద్దిపేటలో అరెస్ట్ చేసిన తరువాత ముఖ్యమంత్రి పై బండి సంజయ్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. “సిద్దిపేటలో అక్రమంగా, కారణం లేకుండా అరెస్ట్ చేశారు, సీపీ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలపాలి. సిగ్గులేని రాష్ట్ర ముఖ్యమంత్రి, బట్టేబాజ్ ముఖ్యమంత్రి అదేశాలతోనే సీపీ ఇలా వ్యవహరించారు. నన్ను బలవంతంగా వ్యాన్ లో ఎత్తుకొచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో ఒడిపోతున్నామన్న భావనలో అడ్డదారుల్లో వెళుతుంది. భాజపా గెలుస్తుందన్న అక్కసు తోనే నాపై దాడి. పోలీసులు TRS పార్టీ కార్యకర్తలయ్యారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లొనే తప్పతాగి పాలన చేస్తున్నారు. నీ సంగతి చూస్తా కేసీఆర్” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గత నెల 20 వ తేదీన వంశి అనే యువకుడిని అరెస్ట్ చేసి ఇదేవిదంగా రాత్రంత్రా హింసించి ఉదయం 4 గంటలకు వదిలి పెట్టారు. ఈరోజు పోలీసులతోనే డబ్బులు పెట్టించి భాజపా అభ్యర్థి పై రుద్దాలని నీచమైన కుట్రకు తెరలేపారు. పసిపాపను పక్కన పెట్టి చెకింగ్ చేయటం రజాకార్ల పాలన తలపిస్తుంది. డబ్బును కాపాడలేని సీపీ ని తక్షణమే సస్పెండ్ చేయండి. సీపీ, ముఖ్యమంత్రి మోచేత నీళ్లు తాగుతున్నారు. జితేందర్ రెడ్డి, వివేక్ మరియు నాపై అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లోకి వస్తా… ప్రగతిభవన్ లోకివస్తా… భయపడే వ్యక్తిని కాదు…న్యాయం కోసం ఎంతకైనా పోరాడుతానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న, సీపీ నా గొంతు పట్టుకున్నారు. ప్రివిలేజ్ మోషన్ లో పెట్టి లోకసభ స్పీకర్ కు పిర్యాదు చేస్తాం. దుబ్బాక ఫలితమే TRS కు రాజకీయ సమాధి. దుబ్బాక ప్రచారానికి సీఎం ఎందుకు రావట్లేదు, దుబ్బాక ఫలితాలే ఆధారంగా 2023 భాజపా అధికారంలోకి వస్తుంది. పత్రికా స్వేచ్ఛ ను కొన్ని ఛానళ్లు హరించాయి. కొన్ని ఛానళ్లు మాత్రమే…దయచేసి అందరికి అపాదించొద్దు అని ఆయన అన్నారు. రేటింగ్ ఛానళ్లు, పత్రికలు అవాస్తవాలను, వాస్తవాలుగా చిత్రీకరించారు. ఆవేదనతో మాట్లాడుతున్న… దయచేసి నా విజ్ఞప్తి ని అర్థం చేసుకోండి. కష్టపడి పని చేస్తే పత్రికలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి అని ఆవేదన వ్యక్తంచేశారు. 30 లక్షల సభ్యత్వం గల నికార్సైన కార్యకర్తలు ఉన్నారు. ఉద్యమిస్తే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.