మొక్కజొన్న పంట వల్ల గతంలో వచ్చిన నష్టాల దృష్టిలో పెట్టుకుని మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి కనీసం వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న సాగు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది, కానీ రైతులు మొక్కజొన్న సాగు చేశారని సీఎం కేసీఆర్ ముందు ఒకింత అసహనం గురిఅయ్యారు. అయినా సరే రైతే రాజు రైతుకి నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో మొక్కజొన్న రైతుల కి తీపి కబురు చెప్పారు తెలంగాణా సిఎం కేసిఆర్.
ధాన్యం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. క్వింటాలుకు రూ.1,850 ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు కేసీఆర్. రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలంగాణా సిఎం.
మొక్కజొన్నలుకి వర్షాకాలంలో మద్దతు ధర వచ్చే అవకాశం లేదు, కాబట్టి రైతులు మొక్కజొన్న సాగు చేయవద్దని కోరాం, అయినప్పటికీ రైతులు మొక్కజొన్న సాగు చేశారని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చెప్పినా సరే సాగు చేశారని, నిజానికి ప్రభుత్వానికి ఇప్పుడు కొనుగోలు చేసే బాధ్యత లేదు కానీ రైతులు నష్టపోతే ప్రభుత్వం చూస్తూ ఉండిపోతే అది గవర్నమెంట్ ఎలా అవుతుంది, రైతులు నష్టపోవద్దు అని ఒకే ఒక్క కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించింది అని కేసీఆర్ తెలిపారు.
గత సీజన్ లో మార్క్ ఫెడ్ ద్వారా 9 లక్షల టన్నుల మొక్కజొన్న రైతుల నుంచి కొనుగోలు చేసాం, దీనికోసం రూ. 1668 కోట్లు ఖర్చు చేసి ఖర్చుపెట్టాం అని సిఎం తెలిపారు. అయితే కొనుగోలు చేసిన ఆ మొక్కజొన్న కి బయట మార్కెట్లో ధర లేకపోవడం వల్ల వేలం వేయాల్సి వచ్చిందని అన్నారు. దీనివల్ల కేవలం రూ. 823 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. అందువల్ల మార్క్ ఫెడ్‌కు మొత్తంగా 845 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. అయితే గత సీజన్లో మద్దతు ధర క్వింటాళుకు రూ.1,760 చెల్లించి మార్క్ ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు చేసింది. అయినా భారీ నష్టం వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలో పంట వద్దని చెప్పామని సిఎం తెలిపారు.