Kiara Advani: స్టార్ హీరోయిన్ ఖాతాలో పాన్ ఇండియా ప్లాప్స్.. కియారా లక్కీ లేడీ ఇమేజ్‌కు బ్రేక్
Kiara Advani: బాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న నటి కియారా అద్వానీ. ‘ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తెలుగులో ‘భరత్ అనే నేను’ చిత్రంతో తొలి అడుగులోనే సూపర్ హిట్ అందుకున్నారు. హిందీలో ‘కబీర్ సింగ్’, ‘గుడ్ న్యూస్’, ‘షేర్షా’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి వరుస విజయాలతో లక్కీ లేడీగా, పాన్-ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘సత్య ప్రేమ్ కీ కహానీ’ తర్వాత ఆమె ఇమేజ్ మరింత బలపడింది.
అయితే ఇటీవల కాలంలో కియారా కెరీర్‌కు కొంత బ్రేక్ పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్-ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ అనుకోని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కియారా అంచనాలను తలకిందులు చేసింది. ఆ తర్వాత, హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ కూడా ఆమెకు ఆశించిన విజయాన్ని అందించలేదు. ఈ రెండు భారీ చిత్రాల వైఫల్యాలు కియారా కెరీర్‌లో వరుస ఎదురుదెబ్బలుగా మారాయి.
ప్రస్తుతం కియారా అద్వానీ ఆశలన్నీ తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ పైనే ఉన్నాయి. ఈ చిత్రంతో ఆమె కన్నడ సినీ పరిశ్రమలోకి యశ్ (Yash) సరసన హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, ఇది గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇంగ్లీష్‌తో సహా ఇతర భాషల్లోనూ తెరకెక్కుతోంది.
వ్యక్తిగత జీవితానికి వస్తే, ఈ సంవత్సరమే తల్లిగా ప్రమోట్ అయిన కియారా అద్వానీ, ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ కారణంగానే, ఆమె చేతిలో ఉన్న మరో ముఖ్యమైన పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘శక్తిశాలిని’ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక బిగ్ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ మాత్రమే. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వరుస పరాజయాల తర్వాత, యశ్ ‘టాక్సిక్’తో కియారా మళ్లీ లక్కీ లేడీగా మారాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
