Kidney Failure Symptoms : మనిషి జీవించడానికి శరీర భాగాలలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి పాడైతే ఇంక మనిషి జీవనం కష్టతరమే. ప్రాణానికి ప్రమాదం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. కిడ్నీలు చేసే పని బాడీలోని ఫ్లూయడ్స్ నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ ను అవసరంలేని నీటిని కిడ్నీలు వడగట్టి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి.
అందుకే కిడ్నీలు మానవులకు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇండియాలో హెల్త్ ఇష్యుస్ వల్ల ఎక్కువగా మరణాలకు సంభవిస్తాయి. వాటిల్లో అధికమరణాలు కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్లనే ఉండడం గమనార్హం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. పలు నేషనల్ హెల్త్ రిపోర్ట్ లు కూడా కిడ్నీల ప్రాముఖ్యత గురించి వెల్లడించాయి. డయాబెటిస్, హైబీపీ, వయసు మీద పడడం వల్ల కిడ్నీ డిసీజెస్ అధికంగా సంభావిస్తాయని వరల్డ్ వైడ్ గా దాదాపుగా 6.96
కోట్ల మందికి పైగా కిడ్నీ బాధితులు ఉన్నారని, అలాగే దేశంలోనే 1.14 కోట్లకు పైగా ఉన్నారని, ఈ పరిశోధనలో వాళ్ళు వెల్లడించారు. ఇక మరణించే వారి సంఖ్యతో చూస్తే 14 నుంచి 70 సంవత్సరాల లోపు వారిలో 2.9 శాతం మంది ఈ కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్లనే చనిపోతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మరి కిడ్నీ సమస్య రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి.
లక్షణాలు
శరీరంలో కిడ్నీలు పాడవుతున్నాయంటే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా యూరిన్ నుండి ప్రోటీన్ బయటికి పోతూ ఉంటుంది. హెల్దీగా ఉన్న వ్యక్తుల్లోనూ ఇలా జరుగుతుంది. కిడ్నీలు చాలా వీక్ గా, లేదా పాడైనప్పుడు మాత్రం ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో బయటకు వెళ్తుంది. ఇది సూచికగా భావించాలి. ప్రోటీన్యూరియా గా ఈ సమస్యను నిపుణులు భావిస్తారు.
శరీరంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మెయిన్ రీజన్ డయాబెటిస్ హైబీపీ. ఇక వాటి నియంత్రణలో ఉంచుకోలేకపోతే క్రమంగా కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ. మరో లక్షణంగా యూరిన్ కలర్ బట్టి కూడా కిడ్నీలు పరిస్థితి ఏంటో చెప్పవచ్చు. మీరు యూరియా, లవణాలు కలిసి ఉంటాయి.
బాడీలో ఏమైనా యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్టోరేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ యూరియాను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది శరీరం ద్వారా వచ్చే వ్యర్థ పదార్థం. అయితే హార్డ్వార్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఫ్లూయిడ్స్ ను కిడ్నీలు శుభ్రపరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అవి త్వరగా రక్తంలో కలిసిపోతాయి. కామన్ గా యూరిన్ కలర్ లైట్ ఎల్లో నుంచి డార్క్ బ్రౌన్ వరకు వివిధ రకాలుగా ఉంటుందని వారు తెలిపారు.
కాగా ఎవరికైనా మూత్రం రెడ్ కలర్ లో డార్క్ బ్రౌన్ లేదా ఇతర ఏ డార్క్ కలర్ లో వచ్చినా కూడా కిడ్నీలు పాడైనవి అని అనుమానించవచ్చని, వారు తెలుపుతున్నారు. కాబట్టి యూరిన్ కలర్ ని బట్టి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.