Kidney Health Precautions : మన శరీరంలో ప్రధాన భాగాలలో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలకు ఏదైనా సమస్య వస్తే అది ప్రాణానికే ప్రమాదకరంగా మారుతుంది. కిడ్నీలకు వచ్చే సమస్యలను ముందుగా ఎలా గుర్తించాలి? ఏ లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఎటువంటి ఆహారం తీసుకుంటే కిడ్నీ సమస్య నుంచి మనం దూరం కావచ్చు అన్న విషయాలను తెలుసుకుందాం.
కిడ్నీలలో సమస్య వస్తే ముందుగా కాళ్లు, చేతులు నీరు వచ్చినట్టుగా, వాపు వచ్చినట్టుగా మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు ఉగ్గుపోయినట్లుగా అవుతాయి అలాగే మూత్ర విసర్జన చేసే సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీ శరీర భాగంలో కనిపించినట్లయితే మీరు వెంటనే వైద్యున్ని సంప్రదించి కిడ్నీల సమస్య నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఎటువంటి ఆహారం తీసుకుంటే కిడ్నీ సమస్యలు దరిచేరవు కూడా తెలుసుకుందాం..
సముద్రపు చేపలు : సముద్రపు చేపలలో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్స్ మనకు లభిస్తాయి. సముద్రపు చేపల్ని తరచుగా తినడం వల్ల ఆ చేపలలో ఉండే ప్రోటీన్లు కిడ్నీలను కాపాడడంలో దోహదపడతాయి.
తాజా పండ్లు : కిడ్నీలను రక్షించడంలో పండ్లు చాలా ఉపయోగపడతాయి. తాజా పండ్లను అలాగే పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్ధాలు బయటికి విసర్జింపబడతాయి. దానివలన కిడ్నీలు శుభ్రంగా అవుతాయి. ఈ ప్రక్రియ ద్వారా కిడ్నీల సమస్యల నుంచి దూరం కావచ్చు.
కూరగాయల జ్యూస్ : డయాలసిస్ చేపించుకునేవారు కిడ్నీల సమస్య నుంచి దూరం కావాలనీ, కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే తరచుగా కూరగాయల జ్యూస్ ను తాగుతూ ఉండాలి.
బెర్రీలు : బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాపిల్ : యాపిల్ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు అధికంగా లభించే యాపిల్స్ ను రోజూ తినడం వల్ల కిడ్నీలు అనారోగ్యానికి గురికావు. మలబద్ధకం సమస్య కూడా దరిచేరదు.