Kishan Reddy AP Tour – ఎపి లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
ఈ నెల 14వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక రోజు పర్యటనకు వస్తున్నారు.
14వ తేదీ ఉదయం ఢిల్లీ నుండి వాయుమార్గం లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ఉదయాన్నే చేరుకుంటారు.
అక్కడ నుండి రోడ్డు మార్గంలో విజయవాడ కు వస్తారు.
విజయవాడ నుండి పెదకూరపాడు మండలం ఉదయం 10గం. చేరుకుని అమరలింగేశ్వర స్వామి ని దర్శించుకుంటారు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
Gallery: Ananya Nagalla Hot Phots in Black Dress
అక్కడ నుండి తిరిగి విజయవాడ చేరుకుని మధ్యాహ్నం 3గం. లకు విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకుని విజయవాడ _ధర్మవరం_మచిలీపట్నం ట్రైయిన్ అధికారికంగా ప్రారంభిస్తారు.
సాయంత్రం 4గం. కనకదుర్గ అమ్మవారిని దర్శించు కుంటారు.
సాయంత్రం 6గం.లకు పాలిటెక్నిక్ కళాశాలలో బుక్ షో లో పాల్గొంటారు ఈసందర్భంగా మోడీ @20 తెలుగు వెర్షన్ పుస్తకం కేంద్ర మంత్రి ఆవిష్కరణ చేస్తారు.
అనంతరం కేంద్ర మంత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుని అక్కడ నుండి వాయు మార్గం లో ఢిల్లీ తిరిగి పయనమౌతారు..