Kitchen Tips : ఫ్రిడ్జ్ లో అన్ని రకాల వస్తువులు నిల్వ ఉంచుతాం. అలా ఉంచడం వల్ల డోర్ ఓపెన్ చేయగానే ఒక విధమైన వాసన వస్తుంది .ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ తెరుస్తారేమో అని కంగారు పడుతుంటాం. అలాంటివారి కోసమే ఈ చిట్కా. ఒక నిమ్మకాయను కట్ చేసి ఫ్రిజ్ లోపల మూలల్లో పెడితే ఫ్రిడ్జ్ లోని దుర్వాసన, పోయి మంచి వాసన వేస్తుంది.
* బీట్ రూట్ జ్యూస్ గానో, బీట్రూట్ కూరలాగానో వాడుకోవచ్చు అనేది మనకు తెలుసు. కానీ కొన్ని రకాల వంటల్లో ఫుడ్ కలర్ గా కూడా బీట్రూట్ వాడొచ్చు. అది ఎలా అంటే, ముందుగా బీట్రూట్ ని బాగా ఎండబెట్టి పొడి చేయాలి. ఫుడ్ కలర్ వాడే ప్లేస్ లో ఈ పొడిని వాడాలి. సహజ సిద్ధమైన బీట్రూట్ వాడడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
* ఫ్రైడ్ రైస్, పులిహోర, పలావు లాంటివి వండినప్పుడు అన్నం ముద్దగా ఉంటే అసలు బాగోదు. అన్నం పొడిగా రావాలంటే అన్నం పొంగుకు రాగానే దాంట్లో ఒక స్పూన్ నెయ్యి కానీ లేకపోతే ఒక స్పూన్ నూనె కానీ వేస్తే అన్నం పొడి పొడిగా చాలా బాగా వస్తుంది .అలా పొడిగా వచ్చిన అన్నంతో పలావ్, పులిహోర లాంటివి బాగా కుదురుతాయి.
* అందరి ఇండ్లలో పిండి రుబ్బుకోవడానికి గ్రైండర్ అందుబాటులో ఉండదు. మరి ఇడ్లీ పిండి మెత్తగా వచ్చి పులియాలి అంటే మిక్సీలో పిండి పట్టేటప్పుడు చల్లని నీళ్లు వేసి మిక్సీ పట్టాలి. అప్పుడు ఇడ్లీ పిండి గ్రైండర్లో పట్టిన పిండి మాదిరిగా పులిసి బాగా పొంగుతుంది.
* చపాతీలు చేసినప్పుడు టైం ఎక్కువైపోతే మెత్తగా ఉండవని గట్టిపడిపోతాయని చపాతీలు చేసే పనిని అందరూ వాయిదా వేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ చిట్కా. చపాతీ పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులుగా పాలు లేక గోరువెచ్చని నీటిని వేసి కలపాలి. చపాతీలు మృదువుగా వచ్చి ఎన్ని గంటలైనా గట్టిపడకుండా ఉంటాయి.
* పప్పులు మనం ఎక్కువగా తెచ్చుకొని నిల్వ ఉంచుకోవాలి అనుకుంటాం. కానీ రోజులు గడిచే కొద్దీ పప్పులు పురుగు పట్టెస్తాయి . అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే పప్పులు ఉన్న డబ్బాలో వేపాకులు వేస్తే ఆ వేపాకు వాసనకు పప్పులు పురుగు రావు.
* వర్షాలు పడితే ఇంట్లో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పుదీనా ఆకులను కట్ చేసి ఈగలు ఉన్న స్థలాల్లో పెడితే ఈగలు పరార్ అవ్వడం ఖాయం.
* వేపాకులు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. మనం రోజూ వాడే బియ్యం ఎక్కువగా నిల్వ ఉంచుకుంటే కొన్ని రోజులకు పురుగు పడతాయి. అలాకాకుండా ఉండాలంటే వేపాకును ఎండబెట్టి పొడి చేసుకుని చిన్న మూటలాగా కట్టి బియ్యం బస్తాల్లో వేయాలి. వేపాకులో ఉండే యాంటీసెప్టిక్ లాంటి సహజ గుణం వల్ల బియ్యానికి పురుగు రాదు.
Discussion about this post