KL Rahul : కే ఎల్ రాహుల్ కి షాక్ ఇచ్చిన బీసీసీఐ…ఇక కెరీర్ ముగిసినట్టేనా..??
టీమిండియా ఆటగాడు కే ఎల్ రాహుల్ ఈ మధ్య కాలంలో.. బ్యాటింగ్ లో విఫలం అవుతూ..తరచూ విమర్శలు ఎదుర్కుంటున్న క్రికెటర్.
ఐపీఎల్ అద్భుతంగా ఆడే ఇతడు.. జాతీయ జట్టు తరఫున మాత్రం ఏడాది నుంచి ఫామ్ కోల్పోయాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రతిదానిలోనూ ఫెయిలవుతూ ఉన్నాడు. ఓపెనర్ గా పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు.
ఈ క్రమంలోనే రాహుల్ విషయంలో బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై నెటిజన్స్ చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రాహుల్ కు ఏం జరిగింది?
తాజాగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు, మూడు వన్డేలకు జట్టుని ప్రకటించింది. టెస్ట్ జట్టులో ఎలాంటి మార్పు చేయనప్పటికి.. ఆటగాడిగా విఫలం అవుతున్న కేఎల్ రాహుల్ ని ఏకంగా టెస్టు, వన్ డే వైస్ కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక ప్రస్తుతం టెస్ట్ ల్లో రాహుల్ కి బదులు వేరే ఎవరినీ వైస్ కెప్టెన్ గా నియమించలేదు..
ఇక ఆస్ట్రేలియా తో మొదటి వన్ డే కి ఫ్యామిలీ కారణాలతో రోహిత్ దూరం అవగా.. కెప్టెన్ గా హార్దిక్ కొనసాగుతాడు అని బీసీసీఐ ప్రకటించింది.బీసీసీఐ నిర్ణయం వెనుక..రాహుల్ వైఫల్యం కారణమే ప్రధానం అని అనుకోవడం లో తప్పేం లేదు..కాగా రాహుల్ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ అందుకున్న తర్వాత నుండి చూస్తే గనుక 7 టెస్టుల్లో 175 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉండగా గతేడాది కూడా ఒక్కసారే 50 పరుగులకు మించి చేశాడు.
దీంతో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్ లో రాహుల్ ను వన్డే వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించిన విషయం తెలిసిందే . T20 కెప్టెన్ హార్దిక్ పాండ్యని ఆ ప్లేస్ లో నియమించడం జరిగింది . ఇక ఆస్ట్రేలియా తో జరిగే వన్ డేల్లో కూడా వైస్ కెప్టెన్ గా హార్దిక్ నే ప్రకటించింది.
ఆస్ట్రేలియా తో జరిగే రెండు టెస్టుల్లో రాహుల్ ని తుది జట్టులోకి తీసుకుంటే గిల్ బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ మ్యాచుల్లోనూ రాహుల్ విఫలమైతే అతడి కెరీర్ ప్రమాదంలో పడొచ్చు.
Discussion about this post