Kodandaram’s Chance in Congress : ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా సీట్లు కేటాయిస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలకు ప్రాధాన్యమిస్తామని, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇదివరకే ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో ఇదే విధంగా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్ గెలిచిన తర్వాత కోదండరామ్ కి కీలకమైన బాధ్యతలు అప్ప చెప్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లు సమాచారం. అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కోదండరామ్ కి ఏ పదవి ఇవ్వబోతున్నారనే దానిపైన వాడివేడిగా చర్చ సాగుతుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే తన సొంత టీమ్ ని ఏర్పాటు చేసుకునే పనిలో బిజీ, బిజీగా ఉన్నారు.
సీఎంవో ముఖ్య కార్యదర్శి నియామకాలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్ కి కూడా కీలక పదవి ఇచ్చేటట్లు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారట. కోదండరామ్ కి ఉన్నటువంటి అపార జ్ఞానం, అనుభవం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే నిర్ణయం తీసుకోవాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
అలాగే వనరులు, విద్య తెలంగాణ అకనుకులమైన పరిపాలన వంటి రంగాల్లో కూడా కోదండరాంకు అపారమైన అనుభవం ఉన్నాయి. ఇవన్నీటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ ఆయనకు కీలక బాధ్యతలు అప్ప చెప్పాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే ఉద్యోగ నియామకాల్లో కీలకమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్గా కూడా కోదండరామ్ ని నియమించే అవకాశం ఉందని ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది.
ఇంతే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టిఎస్పిఎస్సి పై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. పేపర్ లీకేజీ ఘటనతో టిఎస్పిఎస్సి ప్రతిష్ట మసకబారిపోయింది. ఇదంతా ఆలోచించిన రేవంత్ రెడ్డి కోదండరామ్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తే నిరుద్యోగులలోను నమ్మకం ఏర్పడుతుందని భావిస్తున్నారంట. ప్రభుత్వ సలహాదారు లేదంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా కోదండరాంకు ఏదో ఒక పదవి మాత్రం ఖచ్చితంగా దక్కె అవకాశం ఉందని రేవంత్ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.