Kota Srinivasa Rao Serious on Rumors : సోషల్ మీడియాలో ఇటీవల రియల్ న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది సెలబ్రెటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్లు క్షేమంగా, సంతోషంగా ఉన్న నటీనటుల మీద రూమర్లను క్రీయేట్ చేస్తారు. ఇంకొన్నిసార్లైతే ఏకంగా చనిపోయారంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తారు. చివరకు వారే నేను బతికున్నాను అంటూ వీడియో విడుదల చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు కోట శ్రీనివాసరావు విషయంలో అదే జరిగింది. కోట శ్రీనివాసరావు విలక్షణ నటనకు పెట్టింది పేరు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కబ్జా సినిమాలో ఓ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై నటుడు కోట శ్రీనివాసరావు స్పందించారు. సోషల్ మీడియాలో నేను చనిపోయానని వార్త రాశారంట. నిజమేనని.. ఎవరెవరో ఫోన్లు చేశారు. ఆఖరికి పోలీసులు కూడా సెక్యూరిటీగా ఇంటికి వచ్చేశారు. నేను బ్రతికే ఉన్నా. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్వయంగా ఆయనే ఓ వీడియో రిలీజ్ చేయడం గమనార్హం.