జనహితమే టీఆర్ఎస్ ప్రభుత్వం అభిమతమన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. కులం, మతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తల నుంచి శ్రామికుల వరకు అన్నివర్గాలకు నష్టం వాటిల్లకుండా లబ్ది చేస్తున్నట్టు చెప్పారు.
ఇవాళ రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్,ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.