UPI Limit: ప్రస్తుతం ఇండియాలో ఎక్కువమంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ (UPI Payments) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిజికల్ క్యాష్, వ్యాలెట్‌లు మోసుకెళ్లే భారం దాదాపుగా తగ్గిపోయింది. గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే వంటి వివిధ యాప్‌ల ద్వారా పేమెంట్స్ స్వీకరించే అవకాశం కలిగింది. అయితే మీరు ప్రతిరోజూ చేసే యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై లిమిట్ ఉందని తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం.. ఒక వినియోగదారుడు ఒక రోజులో UPI ద్వారా రూ.లక్ష వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలడు. అంతేకాకుండా ఒక రోజులో UPI ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయగల మొత్తం ఆయా బ్యాంకులు, ఉపయోగిస్తున్న యాప్‌లపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే యాప్‌ల మ్యాక్సిమం లిమిట్, ట్రాన్సాక్షన్స్ లిమిట్ తెలుసుకుందాం..
గూగుల్ పే:
గూగుల్ పే లేదా జీ పే వినియోగదారులు UPI ద్వారా ఒక్క రోజులో రూ.లక్ష కంటే ఎక్కువ పంపలేరు. అదేవిధంగా యాప్ వినియోగదారులు ఒక రోజులో 10 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్‌లు చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే గరిష్ఠంగా రూ.లక్ష పంపగలరు, రోజులో వివిధ మొత్తాల్లో 10 ట్రాన్సాక్షన్‌లు మాత్రమే చేయగలరు.
Also Read: UPI ద్వారా పొరపాటున తప్పుడు అకౌంట్ కి డబ్బులు పంపారా.. అయితే ఇలా చేయండి..!?
అమెజాన్ పే:
అమెజాన్ పే యూపీఐ ద్వారా రోజులో రూ.లక్ష వరకు పేమెంట్స్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ఒక రోజులో 20 ట్రాన్సాక్షన్‌లు చేసుకోవచ్చు. కొత్త వినియోగదారులు మొదటి 24 గంటల్లో రూ.5,000 వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలరు.
ఫోన్‌పే:
ఫోన్‌పేకి కూడా గూగుల్‌పే తరహాలోనే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.లక్ష గానే ఉంది. రోజులో రూ.లక్షకు మించి పేమెంట్స్‌ను అనుమతించదు. అయితే ఈ యాప్‌లో ఒక రోజులో 10 ట్రాన్సాక్షన్‌ల లిమిట్ లేదు. రూ.లక్ష విలువ దాటకుండా రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్‌లు అయినా చేసుకోవచ్చు.
పేటీఎం:
NPCI ప్రకారం.. పేటీఎం నుంచి కూడా రోజుకు రూ.లక్ష విలువైన ట్రాన్సాక్షన్‌లు మాత్రమే చేయగలరు. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్‌ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. రూ.లక్ష విలువ దాటకుండా రోజుకు పేటీఎం కస్టమర్లు ఎన్ని ట్రాన్సాక్షన్‌లు అయినా చేయవచ్చు.