బీహార్ లోని వైశాలి జిల్లా లో దారుణం వెలుగుచూసింది. కొంతమంది లిక్కర్ మాఫియా విదేశీ మద్యం దాచడానికి ఏకంగా పాఠశాలనే కేంద్రంగా చేసుకున్నారు. పాఠశాల తాళం బద్దలుకొట్టి లిక్కర్ ని గదిలో పెట్టి తమవెంట తెచ్చిన వేరే తాళం వేశారు.
ఈ దారుణమైన సంఘటన బీహార్ లోని వైశాలి జిల్లా లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని బృందావన్ గ్రామం లోని సంసారో రాంరాతి పాఠశాల్లో జరిగింది.
అయితే 140 కార్టోన్స్ లిక్కర్ బాటిల్స్ ని సీజ్ చేసి విచారణ చేస్తున్నట్టు లాల్ గంజ్ SI బ్రిజేష్ తెలిపారు.